నదిలో చిక్కుకున్న బస్సు.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్

-

భారీగా కురుస్తున్న వర్షాలతో.. ఉత్తర్ ప్రదేశ్ లోని కొత్వాలీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో  యూపీ-ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లోని ఓ రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు రూపెదిహా నుంచి హరిద్వార్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బస్సు ముందుకెళ్లలేకపోయింది. తమను కాపాడాలంటూ ప్రయాణికులు బిగ్గరగా అరిచారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే జేసీబీలతో సహా అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను రక్షించారు. బస్సును కూడా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మరోవైపు భారీ వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో ఇప్పటికే మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news