దసరాకు దబిడిదిబిడే.. ‘భగవంత్‌ కేసరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

-

నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి మరోసారి రెడీ అవుతున్నారు. వీరసింహా రెడ్డిగా సంక్రాంతికి రికార్డులు బ్రేక్ చేసిన బాలయ్య ఈసారి దసరాకు భగవంత్‌ కేసరి’గా వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కాజల్‌, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేకర్స్ ఇవాళ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబరు 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘భగవంత్‌ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది’ గన్స్‌ పట్టుకుని బాలకృష్ణ నడిచి వస్తున్న ఫొటోను పంచుకున్నారు.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.  ‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’’ అంటూ బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ దద్దరిల్లింది.

Read more RELATED
Recommended to you

Latest news