ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి..మరో 16 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోసమేనా ?

-

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధాని తో పాటూ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందట. తెలంగాణా లో వరదల పై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్నారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అటు పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.

అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. పీసీసీ చీఫ్‌గా మహేశ్ ఎంపికైన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలవనున్నారు పీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్‌. అయితే… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లింది.. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోసమేనట. ముగ్గురుపై కోర్టు సీరియస్‌ అయిన నేపథ్యంలో..మరో 16 ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ చేర్చుకునేందుకు రేవంత్‌ స్కెచ్‌ వేశాట. మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లో చేరితే… బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనం అవుతుందని.. అప్పుడు ఏ కోర్టు ఏం చేయలేదని కాంగ్రెస్‌ అనుకుంటోందట. అందుకే తాజాగా ఢిల్లికీ వెళ్లారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news