భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీడీఎస్ అనిల్ చౌహన్ భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో పాటు తాజా పరిస్థితి పై కీలకంగా చర్చిస్తున్నారు.జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ బైనసర్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడిన విషయం విధితమే.
ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని కుట్రదారులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. త్వరలోనే అత్యంత కఠినంగా వారిని శిక్షిస్తామని పాక్ కుట్రలపై ప్రతీకారం తీర్చుకుంటామని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహన్, త్రివిధ దళాధిపతులు నేవీ చీప్ తో అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ రక్షణ శాఖ కార్యదర్శి ఆర్.కే.సింగ్ లతో రాజ్ నాథ్ భేటీ అయ్యారు. దేశ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.