ఫిబ్రవరి 14వ తేదీ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వాలెంటైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు వాలెంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఈ లవర్స్ డేకు వ్యతిరేకం. ఇది తమ సాంస్కృతి కాదని, వెస్ట్రన్ కల్చర్ ను భారతీయులు ఎవరు ప్రోత్సహించకూడదనేది వారి ఉద్దేశం.
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీని కౌ హాగ్ డే గా జరుపుకోవాలని దేశ ప్రజలను సూచించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ బోర్డు ఇవాళ సర్క్యులర్ ను జారీచేసింది. ఫిబ్రవరి 14వ తేదీనాడు ప్రతి ఒక్కరూ గోవును అలింగనం చేసుకోవాలని, మూగప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకోవాలని పేర్కొంది. గోవులు ఇతర మూగజీవులను ప్రేమించడం భారత సాంస్కృతిలో ఒక భాగం అని గుర్తుచేసింది.