బూస్టర్ డోసు పంపిణీపై ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బూస్టర్ డోసును వచ్చే నెల అంటే జనవరి 10 నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా బూస్టర్ డోసు, 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీపై దేశంలో ని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బూస్టర్ డోసుపై, 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ పంపిణీ పై అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖ రాశారు.
బూస్టర్ డోసును ఫ్రెంట్ లైన్ కార్యకర్తలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వాలని సూచించారు. అలాగే 60 ఏళ్ల కు పై బడిన వారికి వ్యాక్సిన్ తీసుకోవడానికి డాక్టర్ల సలహా అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే బూస్టర్ డోసు పంపిణీ వచ్చే ఏడాది జనవరి 10 నుంచి పంపిణీ ఉంటుందని తెలిపారు. అలాగే 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు జనవరి 1 నుంచి కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియా ఉంటుందని తెలిపారు.