రైతులకు కేంద్రం శుభవార్త..18న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

-

భారత దేశంలోని రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు తేదీని ఖరారు చేశారు.ఈ నెల 18న ప్రధాని మోడీ 17వ విడత సమ్మాన్ నిధి విడుదల కానుంది.

Center is good news for farmers PM Kisan funds will be released on 18th

ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఈ నెల 18న నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతుల ఖాతాలో నగదు జమ అవుతుంది. లక్షలాదిమంది రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది.ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news