తెలంగాణ సీఎం అంటూ భట్టి విక్రమార్క జన్మదిన పోస్టర్లు…!

-

తెలంగాణ సీఎం అంటూ భట్టి విక్రమార్క జన్మదిన పోస్టర్లు కలకలం రేపాయి. భట్టి విక్రమార్క జన్మదిన పోస్టర్లు…కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డిప్యూటీ అని కనిపించకుండా చీఫ్ మినిస్టర్ అని మాత్రమే కనిపించేలా నగరంలో పలు చోట్లలో ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.

Bhatti Vikramarka’s birthday posters which created a stir in Congress ranks

దీంతో రేవంత్ రెడ్డి వర్గం, భట్టి వర్గంగా ఏర్పడి కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్గత తగాదాలు తెరపైకి వచ్చాయి. కాగా కావాలనే పోస్టర్లు అలా వేయించారని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయాలు వెల్లడించారు. కాగా అటు… తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ప్రజా భవన్ లో కేకు కటింగ్ జరిపించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news