రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. మే 23 నుండి ఆర్బిఐ రీజనల్ ఆఫీసుల్లో 2000 నోట్లు మార్చుకోవచ్చు అని పేర్కొంది. 2000 నోట్లను సర్కులేషన్ లో ఉంచొద్దని బ్యాంక్ లకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న 19 ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాలలో 2000 నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
అయితే తాజాగా దీనిపై కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించిన గడువును పొడిగించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే వెల్లడించిన గడువు సెప్టెంబర్ 30 లోగా తమ వద్ద ఉన్న 200 నోట్లను మార్చుకోవాలని తెలిపింది.