కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సాగు చట్టాల ను రద్దు చేయాలని రైతులు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయినా.. రైతులు ఉద్యమాన్ని విరమించ కుండా.. అలానే కొనసాగిస్తున్నారు. దీంతో రైతు ఉద్యమ నేత రాకేష్ టీకాయత్ కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. రైతులు డిమాండ్ చేసిన విధం గానే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశామని.. ఇక రైతు ఉద్యమాన్ని విరమించి రైతులు ఇళ్ల లకు వెళ్లాలని లేఖ లో కేంద్రం రాసుకు వచ్చింది.
అలాగే సాగు చట్టాలను పూర్తి గా తొలగిస్తూ పార్లమెంట్ లో కూడా చట్టం కూడా తీసుకు వచ్చామని తెలిపింది. ఇక ఉద్యమాని విరమించి రైతులు ఇళ్ల కు వెళ్లేలా చూడాలని రాకేష్ టీకాయత్ ను కేంద్ర ప్రభుత్వం కొరింది. కాగ ఈ లేఖ పై రైతు ఉద్యమ నేత రాకేష్ టీకాయత్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే ఇది వరకు రాకేష్ టీకాయత్ ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమంలో చనిపోయిన 700 మంది రైతుల కు కేంద్రం నష్ట పరిహారం ఇవ్వాలని.. రైతుల పై నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని.. అలాగే ఎంసీపీ చట్టం తీసుకు రావాలని రాకేష్ టీకాయత్ ఆధ్వర్యం లో రైతులు ఆందోళన చేస్తున్నారు.