బీజేపీ నేతలవి… బట్టేబాజ్ మాటలే : కల్వకుంట్ల కవిత

బీజేపీ నేతలవి.. అన్ని బట్టేబాజ్ మాటలేనని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. భీమ్ గల్ పట్టణానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

అభివృద్ధి విషయం లో దేశం లో మంచి పేరు తెచ్చుకుంది తెలంగాణ అని తెలిపారు. ఇవన్నీ పక్కన పెట్టి.. కొందరు బీజేపీ నాయకులు రాజకీయం మాట్లాడుతున్నారని…బీజేపీలో తలకాయ ఉన్నోళ్లు లేనోళ్లు అందరూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు… అభివృద్ధి చేయాలంటే మనసుపెట్టి పని చేయాలన్నారు. భీమ్ గల్ లో హాస్పిటల్ ని వంద పడకలుగా మారుస్తామని వెల్లడించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయి..ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మ్యూనిసిపాలిటీగా మరి అభివృద్ధిపతంలో నడుస్తోందన్నారు.. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోందని తెలిపారు. కెసీఆర్ ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసేభాద్యత మాదేనని పేర్కొన్నారు.