రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌పై కేంద్రం నిషేధం

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఉగ్రవాద సంస్థపై నిషేధం విధించింది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీఆర్‌ఎఫ్‌ కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారినికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.

లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్‌ఎఫ్‌ 2019లో ఉనికిలోకి వచ్చింది. ఆర్టీఎఫ్‌ రోజురోజుకు తీవ్రవాద కార్యకలాపాలను తీవ్రంతరం చేస్తున్నట్లు నిఘా సంస్థలు గురించాయి. ఆన్‌లైన్ మీడియాను ఉపయోగించి యువతను రిక్రూట్ చేస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారం, టెర్రరిస్టుల చొరబాట్లు, పాకిస్థాన్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌లో టీఆర్‌ఎఫ్ ప్రమేయం ఉందని కేంద్ర ప్రభుత్వం తన గెజిట్‌లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news