పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లకు జీవిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించే కాలపరిమితిని 2020 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా వైరస్ కారణంగా వృద్ధులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని అందుకే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే కాలపరిమితి విషయంలో ఉత్తమ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
80 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు పైబడిన పింఛన్ దారులు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పింఛన్ దారులు అందరూ తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు సమర్పించ వచ్చును అని ఆయన పేర్కొన్నారు. కాలంలో పెన్షనర్లు తమ పెన్షన్ను నిరంతరాయంగా తీసుకోవచ్చని అన్నారు.