FACT CHECK : నీతి ఆయోగ్ భేటీలో సీఎం మమతా బెనర్జీ మైక్ కట్.. కేంద్రం క్లారిటీ

-

దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ ఆఫ్ చేశారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడేందుకు తగిన అవకాశం ఇచ్చారని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఎక్స్లో వెల్లడించింది. ‘అక్షర క్రమంలో వెళ్తే మమతా బెనర్జీకి మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే మాట్లాడే అవకాశం దక్కేదని.. అయితే సీఎం నుంచి అధికారిక అభ్యర్థన మేరకు ఆమెకు ఏడో స్పీకర్గా మాట్లాడే అవకాశం ఇచ్చారు’ అని పేర్కొంది.

మరోవైపు ఈ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ మమత చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడటానికి తగిన సమయం కేటాయించామని తెలిపారు. ప్రతి టేబుల్‌ ముందు ఉన్న స్క్రీన్పై వారికి కేటాయించిన టైమ్ ఉందని.. తన మైక్ను ఆఫ్ చేశారని మీడియాతో మమత అన్నారని.. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news