పారిస్ ఒలింపిక్స్ 2024.. తొలి స్వర్ణంతో ఖాతా తెరిచిన చైనా

-

పారిస్‌ ఒలింపిక్స్‌ గేమ్స్ కొనసాగుతున్నాయి. క్రీడాకారులంతా ఉత్సాహంగా ఆటల్లో పాల్గొంటూ తమ దేశానికి పతకం తీసుకెళ్లాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే ఈసారి ఒలింపిక్స్లో చైనా దేశం తొలి బోణీ కొట్టింది. ఒలింపిక్స్ 2024లో తొలి స్వర్ణాన్ని చైనా అథ్లెట్ల్స్ టీమ్ దక్కించుకుంది. శనివారం (జులై 27వ తేదీన) జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో లిహావ్‌ షెంగ్‌-యుటింగ్‌ హువాంగ్‌ జోడీ గోల్డ్ మెడల్ ముద్దాడింది. 16-12తో జిహ్యాన్‌ కేయుమ్‌-హజున్‌ పార్క్‌ జంటను ఓడించింది.

అయితే పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి పతకం మాత్రం కజికిస్థాన్కు దక్కింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్‌ కంటే ముందు జరిగిన కాంస్య పోరులో కాంస్య పతకాన్ని సాధించింది. ఇస్లామ్‌ సత్పయేవ్‌-అలెగ్జాండ్రా జోడీ 17-5తో జర్మనీ జంటను ఓడించింది. ఇక ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా 3 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది. చైనా రెండు గోల్డ్, ఒక బ్రాంజ్, అలాగే యూఎస్ ఓ గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజీ మెడల్స్ సాధించి టాప్ త్రీలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news