రైతులకు ఊరట.. రెండ్రోజుల్లో 5లక్షల టన్నుల ఉల్లి కొననున్న కేంద్రం

-

ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించడం వల్ల మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువు ధర పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందిస్తూ రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. రెండు మూడు రోజుల్లో 5లక్షల టన్నుల రబీ ఉల్లిని కొనుగోలు చేసి, అన్నదాతల ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చింది.

ఉల్లి ఎగుమతులపై ఈ నెల 31వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు గతవారం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆంక్షల ప్రభావం వర్తకులపైనే ఉందని, రైతులపై లేదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో ఉల్లి టోకు ధర రూ.13-15గా ఉంటోందని, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని తెలిపారు. ఒకవేళ ధరలు పడిపోతే.. రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news