కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా టెస్ట్.. రిజల్ట్ ఏంటో తెలుసా..?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో చాలామంది కరోనా టెస్టులు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోగా.. ఆయనకి రిపోర్టులో నెగెటివ్ వచ్చింది.

ఈనెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ముందస్తు చర్యగా ఆయన గురువారం కొవిడ్ -19 టెస్టులు చేయించుకున్నారు. తాజాగా వెలువడిన రిపోర్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కాగా, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు శుక్రవారం కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు.