జమిలి ఎన్నికలపై కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి కీలక వ్యాఖ్యలు..!

-

జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తాజాగా స్పందించారు. ప్రస్తుతం కమిటీ మాత్రమే ఏర్పాటు చేశామని.. తెలిపారు. కమిటీ అందించిన రిపోర్టుపై చర్చలుంటాయి. పార్లమెంట్ పరిపక్వమైనది. ఆందోళన పడవద్దు అని చెప్పారు.

పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఎజెండా పై కూడా 3-4 రోజుల్లో తెలుపుతామని చెప్పారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది అని వ్యాఖ్యానించారు ప్రహ్లాద్ జోషి. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం కమిటీనీ నియమించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ను జరుపనున్నట్టు ప్రకటించింది. దీంతో జమిలీ ఎన్నికలను కేంద్రం నిర్వహించడానికి సిద్ధమైందనే ఊహగానాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలోనే ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఇతర పార్టీల అభిప్రాయాలను సంప్రదించకుండానే ఏ విధంగా జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారని పలు ప్రతీపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news