సెప్టెంబర్ వచ్చేసింది.. ఈ 8 పనులు త్వరగా చేసుకోండి..!

-

ప్రతీ నెలా కూడా పలు అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కొత్త నెల ప్రారంభం నుంచే కొత్త రూల్స్ అమలులోకి వస్తూ ఉంటాయి. ఇక ఈ నెలలో ఎలాంటి మార్పులు రానున్నాయి చూసేద్దాం. రూ.2 వేల నోట్ల మార్పిడి వంటి పలు అంశాలకు డెడ్‌లైన ఈ సెప్టెంబర్ నెలలో ముగుస్తుంది. కనుక వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక వివరాలు చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 కరెన్సీ నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకున్న విషయం మనకి తెలుసు.

అయితే వీటిని సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలి. ఆ తరవాత చెల్లవు. అలానేఆధార్ కార్డ్ హోల్డర్స్ ఆన్‌లైన్‌లో ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14 వరకు ఈ అవకాశం ఉంది. ప్రైవేట్ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంకులో అమృత్ మహోత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కి గడువు సెప్టెంబర్ 30 గా పెట్టింది. 375 రోజుల గడువుతో దీన్ని పెట్టింది. అదే విధంగా రెండో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్స్ చేసేందుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ ఎల్ఐసీ ధన్ వృద్ధి పేరుతో సింగిల్ ప్రీమియం పాలసీని తీసుకు వచ్చింది.

ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే 10 రెట్లు లాభం వస్తుంది. ఆఖరి తేదీ సెప్టెంబర్ 30. రేషన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకునే ఛాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కి గడువు సెప్టెంబర్ 30. సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు దాచుకుంటున్నవారు ఆధార్ తో పాన్ లింక్ చేయాలి. ఇలా పొదుపు పథకాల్లో ఉన్నవారంతా 2023 సెప్టెంబర్ 30 లోగా ఆధార్ నంబర్ ఇవ్వాలి. ఒకవేళ రూ.1 లక్షకు మించి డబ్బులు జమ చేస్తుంటే పాన్ నంబర్ కూడా ఇవ్వాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news