చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే.. భారీ వర్ష సూచనతో ఫ్లైఓవర్ లు ఎక్కాయి వేలాది కార్లు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, వేలచేరి పరిసరాల్లో ఫ్లైఓవర్లపై కార్లను పార్క్ చేశారు స్దానికులు. గతంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కార్లు ఎందుకు పనిరాకుండా పోయాయని అంటున్నారు స్దానికులు.
ఫ్లై ఓవర్లపై పార్క్ చేసినా వాహనాలకు ఫైన్స్ వేయడం లేదంటూ ప్రకటించారు అధికారులు. అటు చెన్నైలో ఉదయంలో తెల్లవారుజామున నుండి భారీ వర్షం పడుతోంది. దీంతో టినగర్,వేలాచ్చేరి,అన్నా నగర్, సహా మెరినా పరిసరాలు నీట మునిగాయి. చెన్నై,తిరువళ్ళూరు, కాంచిపురం,చెంగల్ పట్టు జిల్లాలోని స్కూల్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. కంచి, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి, కరూర్, తిరువణ్ణామలై, తిరుచ్చి, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగై, మైలాడుతురై, కడలూరు, కల్లకూరిచి, విల్లుపురం, కల్లకురిచి, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్ష సూచన.. ఫ్లైఓవర్‌పై వాహనాల పార్కింగ్
చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు. వేలచేరి పరిసరాల్లో ఉన్నవారు తమ కార్లను ఫ్లైఓవర్లపై పార్క్ చేశారు. దీంతో ట్రాఫిక్ జామవుతోంది. కాగా అలా పార్క్ చేసిన వాహనాలపై ట్రాఫిక్… pic.twitter.com/NsM9NY4c9n
— ChotaNews (@ChotaNewsTelugu) October 14, 2024