మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన కేసు.. శిల్పి అరెస్టు!

-

మహారాష్ట్రలో సముద్ర తీరం వెంబడి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెలకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అధికార పార్టీని తూర్పారబడుతున్నాయి. ఆ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అయితే, ఈ విగ్రహాన్ని గతేడాది ప్రధాని మోడీ స్వయంగా ఆవిష్కరించగా.. విగ్రహం కూలిపోయాక మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పారు.

అయితే, ఆ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి జయదీప్‌ అప్టేను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌ను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. శివాజీ విగ్రహం కూలిపోవడానికి ప్రభుత్వం కారణం కాదని, ఈ ఇద్దరే అని.. విగ్రహం నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మహా సర్కార్ తెలిపింది. కాగా, పది రోజులుగా పరారీలో ఉన్న ఆప్టే లొంగిపోతానని తన భార్య ద్వారా పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news