మిషన్ దివ్యాస్త్రపై బంగాళాఖాతంలో చైనా నిఘా!

-

గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యమైన  ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పరీక్షను భారత్ సోమవారం రోజున పరిశీలించిన విషయం తెలిసిందే. భారత్‌ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్‌వీ (మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌) టెక్నాలజీని తొలిసారి సోమవారం పరీక్షించింది. అయితే ఈ పరీక్షను చైనా అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది.

ఈ పరీక్షకు కొన్ని వారాల ముందే బీజింగ్‌ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక బయల్దేరింది. ఇప్పటికే మరో నిఘా ఓడ భారత్‌కు పశ్చిమాన మాల్దీవుల్లో తిష్ఠ వేసింది. అలా భారత్ దివ్యాస్త్రపై డ్రాగన్ దేశం ఓ కన్ను వేసి ఉంచింది. ఫిబ్రవరి 23వ తేదీన క్వాంగ్‌డావ్‌ నుంచి ‘షియాంగ్‌ యంగ్‌ హాంగ్‌ 01’ నౌక బయల్దేరింది. 4,425 టన్నుల బరువున్న ఈ ఓడ ఆదివారం బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ప్రస్తుతం అది భారత్‌ అణుశక్తి చోదిత సబ్‌మెరైన్‌ స్థావరమైన విశాఖ తీరం నుంచి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news