తప్పిపోయిన ఐదుగురిని భారత్ కి అప్పగించిన చైనా..

-

గత వారం తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్ యువకులు చైనా లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడుగురు సభ్యుల బృందంలో ఇద్దరు చైనా ఆర్మీ నుండి తప్పించుకోగా మిగతా ఐదుగురు మాత్రం చైనా ఆర్మీ అదుపులో ఉన్నారు. ఈ విషయాన్ని ధృవీకరించిన చైనా లిబరేషన్ ఆర్మీ, వారిని తిరిగి పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే ఈరోజు ఆ ఐదుగురిని చైనా ఆర్మీ ఇండియాకి తిరిగి అప్పగించింది.

ఈ మేరకు కేంద్రమంత్రి కిరెన్ రిజ్జు అధికారికంగా ప్రకటించాడు. కిబిటు అనే ప్రాంతం వద్ద భారత సైన్యం వారిని ఇండియాలోకి తీసుకువచ్చింది. ఐతే కోవిడ్ నియమాల కారణంగా ప్రస్తుతం ఆ ఐదుగురిని క్వారంటైన్ లోకి పంపించారు. పద్నాలుగు రోజుల తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగిస్తామని భారత సైన్యం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news