తప్పేంకాదు.. తండ్రిని ప్రేమగా కొడుకుగా.. “శ్రీరామ మోడీ”

-

అయోధ్య రామ మందిర భూమి పూజతో యావత్‌ భారతావని పులకించింది. జై సియారామ్‌ నినాదాలతో మార్మోగింది. సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌గా నిలిచింది. ఇక కళాకారులు తమ కుంచెతో తమ భక్తి బావాన్ని చాటారు. అందులో బాల రామున్ని అయోధ్యా మందిరం వైపు తీసుకెళ్తున్న మోడీ పెయింటింగ్ బాగా వైరల్‌ అయ్యింది. అయితే ఈ పెయింటింగ్‌పై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వస్తున్నాయి. శ్రీరాముడి కంటే మోడీ పెద్దవాడు కాదని, మోడీ భజన ఆపాలంటూ విమర్శలు చేస్తున్నారు.

మోడీ భుజంపై తలవాల్చి సేదతీరుతున్న రాముడు అనేవిధంగా ఓ ఫోటో కూడా గతంలో విమర్శలకు గురైంది. ఇక్కడ విషయం గ్రహించాలని.. ఆఫోటోకి అర్థం వేరంటూ కొందరు సమర్థిస్తున్నారు. నిజమే మోడీ రాముడి కంటే పెద్దవాడు కాదు.. కానీ ఆ ఫోటోల్లోని అంతరార్థాన్ని రాజకీయం చేస్తున్నారంటూ వాదిస్తున్నారు. శ్రీరాముడుకి వారథి కట్టుకోవడం రాదా ఏంటి..? ఉడుత కూడా సాయం చేసింది. ఉడుతా భక్తిగా.. అంతనే శ్రీరాముడి కంటే ఉడుత గొప్పదా..??? అంటే అవును ఆ సమయానికి ఆ సాయం చాలా గొప్పది.

ఇప్పటికీ శ్రీకృష్ణ మహాత్మున్ని చిన్ని కృష్ణగా భావిస్తూ,  శ్రీకృష్ణుడిని తమ కొడుకుల్లో చూసుకుంటూ.. చిన్ని కృష్ణ అంటూ తల్లులు మురిసిపోతుంటారు కదా.. అంటే అలా కృష్ణుడ్ని ఆరాధిస్తున్న వారంతా కృష్ణుడి కంటే పెద్ద అని అర్థమా..?? అలాగే శ్రీరామ చంద్రుడు తనకోసం పని చేస్తున్న కుమారునిపై ప్రేమగా తలవాల్చినట్లుగా చూడాలి. నిజంగా తండ్రిని ప్రేమగా తండ్రికి కావాల్సినవి చేసే కొడుకులకు ఆ ప్రేమ అర్థమవుతుంది. అంతెందుకు తమ కొడుకులను నాన్న నాన్న అంటూ పిలుచుకుంటారు కదా అంటే అప్పుడు ఆ కొడుకు తండ్రి కంటే పెద్దవాడా..? ప్రేమను చూడండి.. రాజకీయం చెయ్యడం కాదు.. అలాగే శ్రీరామ చంద్రమూర్తి తన మందిర కార్యాన్ని చేపడుతున్న కొడుకైనటువంటి మోడీపై ఇలా ప్రేమ చూపిస్తున్నాడన్నది ఆ కళాకారుడి ఆలోచన. రామమందిర బృహత్‌కార్యాన్ని చేపట్టిన మోదీతో కలసి వెళ్తున్న శ్రీరామ చంద్రమూర్తి తన కొడుకుని చూసి చిన్నపిల్లవాడై బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్తున్నట్లుగా చూపించడం తప్పేంకాదు. ఆ రామ చంద్రమూర్తి మోదీ ద్వారా తన కార్యాన్ని చేయించుకున్నా ఏమీ ఎరగని బాలకుడై అమాయకంగా అద్బుతం వైపు అడులు వేస్తున్నా ఆ దృశ్యం నిజంగా అద్భుతం..

రాజకీయంగా చూస్తే మాత్రం అబ్బా… ఓట్లన్ని పోతాయేమో అనే భయం కొందరు సో కాల్డ్‌ రాజకీయ నాయకుల బాధ అంతే.. అయ్యో అయోధ్య కొలిక్కి రాకపోతే బాగుండు కదా అనుకుంటూ బాధ పడుతున్న రాజకీయ నాయకుల్లారా.. అప్పుడే గాబరా పడితే ఎలా ఇంకా ముందు ముందు చాలా ఉందంటూ రాజకీయంగా కూడా కామెంట్లు పడుతున్నాయి.

-RK

Read more RELATED
Recommended to you

Latest news