అధిష్టానం క్షమిస్తే సచిన్ కు తిరిగి స్వాగతం పలుకుతా: సీఎం అశోక్​ గహ్లోత్​

-

రాజస్థాన్​లో రాజకీయ తమాషాను ప్రధాని నరేంద్ర మోదీయే ఆపాలన్నారు సీఎం అశోక్​ గహ్లెత్​. తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కాంగ్రెస్​ అధిష్ఠానం క్షమిస్తే రాజస్థాన్​ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన సచిన్ పైలట్​ వర్గాన్ని తిరిగి పార్టీలోకి అహ్వానిస్తానని చెప్పారు గహ్లోత్​. తనకు మూడు సార్లు సీఎం అవకాశం ఇచ్చిన పార్టీ.. ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని స్పష్టం చేశారు.

 cm ashok gahleth
cm ashok gahleth

రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తన మద్దతుదారుల మకాంను జైపుర్​లోని ఫెయిర్​మౌంట్​ హోటల్​ నుంచి జైసల్మేర్​లోని సూర్యగఢ్ రిసార్టుకు మార్చారు గహ్లోత్​. అక్కడే ఒకరోజు ఉండి తిరిగి జైపుర్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. మరోమారు పైలట్​పై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నగదు ఆశను భారీగా పెంచారని ఆరోపించారు గహ్లెత్​. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ తన ప్రభుత్వంపైనే దృష్టి సారించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news