ఆవుపేడ కొంటాం.. ల్యాపీలు ఇస్తాం.. రాజస్థాన్​లో కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవే

-

కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్​లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను ఆకర్షించేందుకు ఏడు గ్యారెంటీలు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలు, ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్లెట్‌, 2 రూపాయలకు కిలో ఆవుపేడ కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాల్లో జరిగే నష్టానికి 15లక్షల బీమా పరిహారం వంటి గ్యారెంటీలు ఉన్నాయి.

62 Congress candidates finalized

ఇదివరకే కోటీ 5లక్షల కుటుంబాలకు 5 వందలకే గ్యాస్‌ సిలిండర్‌, కుటుంబంలోని మహిళా పెద్దకు ఏడాదికి 10వేల రూపాయలు వాయిదాలపద్ధతిలో ఇవ్వనున్నట్లు గహ్లోత్‌ ప్రకటించారు. మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం….ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. శునకాల కంటే ఎక్కువగా దేశంలో ఈడీ సంచారం చేస్తోందని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ చెప్పారన్నారు.

“దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కేంద్రం ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. సీబీఐ, ఈడీ, సీబీడీటీ అధిపతులను కలిసేందుకు సమయం కోరాను. ఆర్థిక అక్రమాలను అరికడితే గర్విస్తాం. నేరాలు చేసిన వారిని జైలుకు పంపితే సంతోషిస్తాం, స్వాగతిస్తాం. కానీ 9ఏళ్ల నుంచి దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారాయి. కేవలం విపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్నాయి.” అని గహ్లోత్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news