అధికారంలోకి వచ్చాక.. బెల్టు షాపులు బంద్‌ – జగ్గారెడ్డి

-

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు ఎత్తివేస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రకటించాడు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు ఏమి పనులు చేయకపోయినా… ఎన్నికల మూడు రోజుల ముందు ఓటరుకు 1000 రూపాయలు ఇచ్చి, ఒక బాటిల్ ఇస్తే ప్రజలు ఓటు వేస్తారు అనే ఆలోచనలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

jaggareddy

డబ్బులు తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తారంటే తాను నమ్మనని అన్నారు. మందు బాబులకు కోపం వచ్చినా పర్వాలేదని…. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్టు షాపులను ఎత్తేస్తాం అని ఆయన ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేట మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రజలతో జగ్గారెడ్డి మాట్లాడుతూ…. మందు పంచి గెలుద్దాం అని బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది అని, అందులో వారు ఏ మాత్రం కూడా సఫలీకృతులు కాలేరు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news