స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు ఇవాళ కలవనున్నారు. మూలాఖత్ లో భాగంగా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి సిబిఎన్ తో తాజా రాజకీయ అంశాలు, కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల పరిస్థితిని వివరించనున్నారు. ఇందుకోసం భువనేశ్వరి, లోకేష్ ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్నారు.
కాగా నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారు. తన భద్రతపై అనేక అనుమానాలున్నాయని చంద్రబాబు తాను రాసిన లేఖలో వ్యక్తం చేశారు. అయితే.. చంద్రబాబు లేఖ నేపథ్యంలో జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్టు పోలీసులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. దాంతో ఎస్పీ జైలుకు వచ్చిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారని తెలిపారు.