పార్ల‌మెంటు లో క‌రోనా వైరస్.. ఆందోళ‌నలో ఎంపీలు

ప్ర‌స్తుతం జ‌రుగుత‌న్న పార్లమెంటు సమావేశాక‌ల్లో కరోనా వైర‌స్ వెలుగు చూసింది. దీంతో పార్లమెంటు ఎంపీల‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. సోమవారం వ‌ర‌కు పార్ల‌మెంటు స‌మావేశాల్లో పాల్గొన్న బీఎస్పీ ఎంపీకి కరోనా వైర‌స్ పాజిటివ్ తెల‌డంతో ఎంపీ ల‌లో భ‌యం ఆందోళ‌న మొద‌లైంది. కాగ ప్ర‌స్తుతం శీత‌కాల పార్ల‌మెంటు స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది.

అయితే సోమ‌వారం వ‌ర‌కు పార్ల‌మెంటు స‌మావేశాల్లో పాల్గొన్న బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీ కి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని బీఎస్పీ ఎంపీ కున్నార్ డానిష్ అలీ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు. దీంతో సోమ‌వారం వ‌ర‌కు పార్లమెంటు స‌మావేశాల్లో పాల్గొన్న ఎంపీలల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయితే ఎంపీ కున్వార్ డానిష్ అలీ త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. త‌ను ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని ఎంపీ తెలిపారు. త‌న‌ను క‌లిసిన వారు అంద‌రూ టెస్టు ల‌ను చేసుకోవాల‌ని.. ఐసోలేష‌న్ లో ఉండాల‌ని సూచించారు.