ది కేరళ స్టోరీ ఎఫెక్ట్.. ప్రియుడిపై మతమార్పిడి కేసు పెట్టిన యువతి

-

ది కేరళ స్టోరీ.. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి విడుదల వరకు ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు ఆ వివాదాల మధ్యే విడుదలైన ఈ చిత్రం వసూళ్ల దూసుకెళ్లడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా తాజాగా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది. ఈ మూవీ చూసిన అనంతరం ఓ ప్రేమ జంట మధ్య గొడవ చోటుచేసుకుంది. అది కాస్తా పోలీసుల వరకూ వెళ్లింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​లోని ఇండోర్‌ ఖజ్రానా పోలీసు స్టేషన్‌ ప్రాంతంలో ఓ ప్రేమ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. యువకుడు మాత్రం 12వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

ఈ జంట ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసొచ్చారు. ఇంటికొచ్చాక సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. పెళ్లి కోసం తనని మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసు అధికారి దినేష్‌ వర్మ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news