గుడ్ న్యూస్‌: భార‌త్‌లోకి క‌రోనా టీకా.. ఎప్పుడంటే?

-

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి విరుగుడు త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లుదేశాల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది మొద‌టి త్రైమాసికంలో టీకా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌లువురు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆరోగ్య‌శాఖ స‌హాయ‌మంత్రి వెల్ల‌డించారు. రష్యా అభివృద్ధి చేసిన టీకా సేకరణ కోసం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రపంచవ్యాప్తంగా 36 టీకాలు వివిధ క్లినికల్‌ ట్రయల్స్‌ దశల్లో ఉన్నాయని, ఇందులో రెండు భారత కంపెనీలకు చెందినవని ఆయ‌న చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన సమాధానమిచ్చారు.

ఇదిలా ఉండ‌గా.. కొద్దిపాటి లక్షణాలున్న కరోనా ఔట్‌ పేషెంట్లకు చికిత్స అందించేందుకు రష్యా తొలిసారిగా ఆర్‌ఫామ్‌ సంస్థకు చెందిన కరోనావిర్‌ ఔషధానికి అనుమతి ఇచ్చింది. ఇది మరో వారంలో ఆ దేశంలోని మెడికల్‌ షాపుల్లో విక్రయానికి అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేగాకుండా.. మే నెల‌లో అవిఫవిర్‌ ఔషధానికి కూడా ర‌ష్యా ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. స్ఫూత్నిక్‌ వీ పేరిట రష్యా ఇప్పటికే వ్యాక్సిన్‌ను తయారుచేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే వివిధ దేశాలు రష్యాతో ఒప్పందం చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news