నేటి నుంచి 15 నుంచి 18 వ‌య‌సు వారికి కోవిన్ రిజిస్ట్రేషన్.. టీకా న‌మోదు ప్ర‌క్రియ ఇలా

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి 15 నుంచి 18 ఏళ్ల పిల్ల‌ల‌కు జ‌న‌వ‌రి 3 నుంచి వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాని కోసం నేటి నుంచి కోవిన్ యాప్ లో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రిజిస్ట్రేష‌న్ కోసం ఆధార్ కార్డు, ఇత‌ర గుర్తింపు కార్డులతో పాటే 10 వ త‌ర‌గ‌తి ఐడీ కార్డును కూడా గుర్తింపు గా ప‌రిగ‌ణిస్తారు.

అయితే ప్ర‌స్తుతం 15 నుంచి 18 ఏళ్ల పిల్ల‌ల‌కు మాత్ర‌మే టీకా వేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంతే కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు ప్ర‌స్తుత స‌మ‌యంలో ఇది వ‌ర్తించ‌దు. ​అయితే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు కోవిన్ యాప్ టీకా న‌మోదు చేసుకునే ప్ర‌క్రియ ఇలా ఉంటుంది.

ముందుగా కోవిన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ నెంబ‌ర్ తో లాగిన్ కావాలి.

ఆధార్ కార్డు, పాన్ కార్డ్, రేష‌న్ కార్డు తో పాటు 10వ త‌ర‌గ‌తి ఐడీ కార్డుల‌లో ఒక‌దానికి గుర్తింపు కార్డుగా ఎంచుకోవాలి.

గుర్తింపు కార్డు ఐడీ నంబ‌ర్, పేరు ఎంట‌ర్ చేయాలి. అలాగే పుట్టిన తేది, జెండ‌ర్ న‌మోదు చేయాలి.

మ‌నం ఉండే ప్రాంతం పిన్ కోడ్ ను ఎంట‌ర్ చేయాలి. అప్పుడు మ‌న చుట్టు ఉన్న వ్యాక్సినేష‌న్ కేంద్రాల జాబితా వ‌స్తుంది.

అందులో ఒక కేంద్రాన్ని ఎంచుకోవాలి. అలాగే టీకా తీసుకునే తేదీ స‌మ‌యాన్ని కూడా న‌మోదు చేయాలి.

మ‌నం కేటాయించ‌న తేదీ రోజు వ్యాక్సినేష‌న్ కేంద్రానికి వెళ్లి కోవిన్ యాప్ నుంచి వ‌చ్చిన నెంబ‌ర్ తో పాటు గుర్తింపు కార్డుతో టీకా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news