మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని ఇస్తోంది. దీనితో ఉద్యోగం కోసం చూసే వాళ్ళు ఉద్యోగాన్ని పొందొచ్చు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 20 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు ఫైనాన్స్, టెక్నికల్,లా విభాగాలలో వున్నాయి. మొదట రాతపరీక్షను నిర్వహిస్తారు. రాతపరీక్ష మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ గా ఎంపిక చేస్తారు. లా పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీడీఎం పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం అప్లై చెయ్యచ్చు. అలానే సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పక ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 24వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 19వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం వుంది. కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలని https://esfc.telangana.gov.in/index.jsp వెబ్ సైట్ ద్వారా చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.