ఐరన్‌ చేయని దుస్తులు ధరించండి..ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ సూచన

-

సాధారణంగా ఆఫీసుకు వెళ్లేవారు నీట్గా ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించి వెళ్తారు. కానీ ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ముడతలున్న దుస్తుల్లోనే ఆఫీసుకు రమ్మని చెబుతోంది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం రండి.

పర్యావరణ పరిరక్షణ కోసం ‘ముడతలు మంచివే’ అంటుంది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌). ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు రమ్మని తన ఉద్యోగులకు సూచించింది. వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు ‘స్వచ్ఛత పక్వాడ’లో భాగంగా ఈ నెల 1-15 తేదీల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం తాము వేసుకొనే దుస్తులను ఇస్త్రీ చేయకుండా ఉండటం ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంస్థ అన్ని ప్రయోగశాలలు, పని ప్రదేశాల్లో విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా కరెంటు బిల్లును 10% తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీన్ని ఈ ఏడాది జూన్‌-ఆగస్ట్‌ మధ్యలో అమలు చేయనున్నారు. విద్యుత్తు పొదుపు కోసం తాము చేపట్టిన చొరవ ద్వారా వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచుతామని సీఎస్‌ఐఆర్‌ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news