ఆ న‌గ‌రంలో కేసులు అత్య‌ధికం.. మృతుల సంఖ్య అత్యల్పం!

-

కొవిడ్‌-19 ప్ర‌పంచాన్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్న‌ది. భార‌త్‌లోనూ క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ప్ర‌ధాన న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతున్న‌ది. దేశంలోని అన్ని మహా నగరాల్లోకన్నా రాజధాని ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య విషయానికొస్తే ఢిల్లీలోనే అత్య‌ల్పంగా కేసులు నమోదవుతుండ‌టం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం చేపడుతున్న ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,82,752కు చేరింది. వ్యాధి భారినప‌డి మ‌రణించిన వారి సంఖ్య 5,401కు చేరింది. దీని ప్రకారం ఢిల్లీలో మ‌ర‌ణాల రేటు 1.9 శాతంగా ఉన్న‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక దేశంలోని ఇతర మహా నగరాల విషయానికొస్తే ముంబైలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 4.3 శాతం, చెన్నైలో 1.93 శాతం, లక్నోలో 2.5 శాతం, ఇండోర్‌లో 2.3 శాతంగా ఉంది. ముంబైలో కరోనా డెత్ రేటు అత్యధికంగా ఉంది. తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. మూడవ స్థానంలో చెన్నై ఉంది. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు గత 10 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news