దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల పేలుడు కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన పై ఢిల్లీ సీఎం అతిశీ స్పందించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాజధాని నగరంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉన్నా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని బహిర్గతం చేసింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది.
కానీ బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించడానికి మాత్రం తన సమయాన్నివినియోగిస్తోంది. దీంతో అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారిందని తెలిపింది అతిశీ. బహిరంగంగానే తూటాలు పేలుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వీటిని నియంత్రించే సామర్థ్యం బీజేపీకి లేదు అని ట్విట్టర్ వేదిక గా తీవ్ర ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం అతిశీ. ప్రజలు పొరపాటున బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా వంటి సదుపాయాల్లో ఆటంకం కలిగే అవకాశం ఉందని తెలిపింది అతిశీ.