దిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నిజమేనా?.. ఐఎండీ చీఫ్‌ ఏమన్నారంటే?

-

దిల్లీలోని ముంగేష్‌పుర్‌లో బుధవారం రోజున అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంత ఉష్ణోగ్రత నిజంగానే నమోదైందా అనే ప్రశ్నలు తలెత్తడంతో దీనిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పందిందించి. దిల్లీలోని ముంగేష్‌పుర్‌ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్‌ సరిగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు.

దిల్లీలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు 20 చోట్ల మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో ముంగేష్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు చూపించింది. దేశంలో ఇంతవరకు ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదు కాలేదు. దిల్లీలో 14 చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్నిచోట్ల 45-50 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతావాటితో పోలిస్తే ముంగేష్‌పుర్‌లో నమోదైన డేటా భిన్నంగా ఉంది. దీనిని ధ్రువీకరించాల్సిన అవసరం ఉంది. అని మహాపాత్ర తెలిపారు. అయితే, కొన్నిసార్లు స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగానూ అధిక ఉష్ణోగత్రలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news