జూన్‌ 9న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్.. 1నుంచి హాల్టికెట్లు

-

తెలంగాణలో గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు జూన్‌ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని .. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే.. ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు.

“జూన్‌ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టికెట్లు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోం. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంట కోసారి బెల్‌మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తాం. అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్‌ను అడిగి సమయం తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష ముగిసేవరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్‌ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి. హాల్‌టికెట్‌పై ముద్రించిన సూచనల కాపీని వెబ్‌సైట్లో పొందుపరిచారు. సూచనలు జాగ్రత్తగా చదివి, వాటిని పరీక్ష సమయంలో పాటించాలి.” అని నికోలస్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news