సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా..అయితే మీకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువే.

-

కరోనా వైరస్‌పై అనేక దేశాల్లో చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి..కొన్ని పరిశోధనలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందటే మరో కొన్ని పరిశోళనలు మ‌నుషులు తుమ్మినా, ద‌గ్గినా, మాట్లాడినా వైర‌స్ వ్యాప్తి చెందుతుందని, గాలిలో ఉండే తుంప‌ర్ల వ‌ల్ల కూడా వైర‌స్ ప్ర‌బ‌లుతుంద‌ని కొన్ని స‌ర్వేలు తేల్చిన విష‌యం తెలిసిందే..అయితే స్టీల్ కానీ, ప్లాస్టిక్ వ‌స్తువుల‌పై వైర‌స్ ఎంత కాలం స‌జీవంగా ఉంటుంద‌నే అంశంపై గత కొంత కాలంగా పరిశోధనలు జరుతున్నాయి..తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు బ్యాంకు నోట్లు, ఫోన్ స్క్రీన్లు, స్టీల్ వ‌స్తువుల‌పై క‌రోనా వైర‌స్ 28 రోజుల పాటు బ్ర‌తికి ఉంటుంద‌ని వారి పరిశోధనలో వెల్లడించారు..SARS-Cov-2 వైర‌స్ ముందుగా ఊహించిన దాని క‌న్నా ఎక్కువ కాల‌మే జీవించి ఉంటుంద‌ని నేష‌న‌ల్ సైన్స్ ఏజెన్సీ ప‌రిశోధ‌కులు తేల్చారు.
వైర‌స్ వ్యాప్తి స్టీల్‌, ప్లాస్టిక్ పాత్ర‌లను తాకితే కూడా కోవిడ్‌19 వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొన్న‌ది. బ్యాంకు నోట్ల‌పై SARS-Cov-2 వైర‌స్ రెండు లేదా మూడు రోజుల పాటు ఉంటుంద‌ని, ప్లాస్టిక్‌-స్టీల్‌పై ఆరు రోజుల పాటు వైర‌స్ స‌జీవంగా ఉంటుంద‌ని తొలుత కొన్ని ప‌రిశోధ‌న‌లు పేర్కొన్నాయి. అయితే ఆస్ట్రేలియా ఏజెన్సీ సీఎస్ఐఆర్‌వో తాజాగా త‌న నివేదిక‌లో కొత్త విష‌యాన్ని వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Latest news