ఐర్లాండ్‌ టూర్‌కు ద్రవిడ్‌, లక్ష్మణ్‌ దూరం !

-

ఐర్లాండ్‌ టూర్‌కు ద్రవిడ్‌, లక్ష్మణ్‌ దూరం కానున్నారు. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు ఈనెల 18 నుంచి ఐర్లాండ్ తో మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కు హెడ్ కోచ్ ద్రవిడ్ గైర్హాజరీతో వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సిరీస్ కు లక్ష్మణ్ వెళ్లడం లేదని NCA తెలిపింది.

లక్ష్మణ్ కి బదులు సితాన్షు కోటక్, సాయిరాజ్ లు ఐర్లాండ్ కు వెళ్లే అవకాశం ఉంది. ఆగస్టు 15న భారత జట్టు డబ్లిన్ కు బయలుదేరనుంది. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ పేరున్న టీమిండియా జెర్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియా కప్ టోర్నికి ఈసారి పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. హోస్ట్ కంట్రీ పేరు… ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. అందులో భాగంగానే భారత జెర్సీలపై ముద్రించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ జెర్సీలతోనే భారత్ బరిలోకి దిగుతుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news