ఆ రాష్ట్రంలో.. కార్పొరేట్‌ ఆఫీసులో బీరు తాగొచ్చు

-

సాధారణంగా కార్పొరేట్ కార్యాలయాలంటే చాలా స్ట్రిక్ట్​గా ఉంటాయి. నియమ నిబంధనలు కచ్చితత్వంతో కఠినంగా అమలవుతూ ఉంటాయి. ప్రతీది పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఏ రకమైన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయి. ఇక సిగరెట్ స్మోకింగ్.. మద్యం సేవించడం వంటివి చేసి ఆఫీసుకు వెళ్లకూడదు. కానీ ఓ రాష్ట్రంలో మాత్రం ఆఫీసు క్యాంటీన్లలో ఏకంగా బీర్ తాగొచ్చట. ఇంతకీ ఎక్కడంటే..?

హర్యానలో ఇకపై కార్పొరేట్‌ ఆఫీసు క్యాంటీన్లలో బీరు కూడా తాగొచ్చు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24కుగానూ రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కార్యాలయ పరిసరాల్లో ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉన్న బీరు, వైన్‌ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది. జూన్‌ 12 నుంచి ఈ సదుపాయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయిదు వేల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version