ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు

-

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల ఎన్నికల ప్రచార ప్రసంగంపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మోదీ, రాహుల్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు ఇచ్చింది. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఏప్రిల్‌ 29వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. అభ్యర్థులు కోడ్‌ పాటించేలా చూసే బాధ్యత పార్టీ అధ్యక్షులదేనని స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంచుతుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీజేపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 77 ప్రకారం తొలుత రెండు పార్టీల అధ్యక్షులైన జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలు ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నాయి. ఏప్రిల్‌ 29 ఉదయం 11 గంటలలోపు స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news