రేవంత్ రెడ్డి కామెంట్స్ కి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్..!

-

రుణమాఫీ చేయడం పక్కా అని, ఆగస్టు 15లోగా జరుగుతుందని రాజీనామా లేక జేబులో పెట్టుకుని రెడీగా ఉండు అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా లేఖ తో వస్తానని నువ్వు వస్తావా అని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామా లేఖలు మేధావులకి ఇద్దామని ఆగస్టు 15లోగా మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసి రుణమాఫీ కనుక చేశారంటే వారు నా రాజీనామా లేఖ ని స్పీకర్ కి ఇస్తారని ఒకవేళ కనుక చేయలేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖని గవర్నర్ కి పంపుతానని హరీష్ రావు అన్నారు.

harish rao vs revanth

ప్రస్తుతం హరీష్ రావు చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి పై మొన్న హరీష్ రావు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేయాలని రుణమాఫీ కనుక చేయకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హరీష్ రావు అన్నారు దానిపై రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ కి మళ్ళీ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news