జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ఈడీ సంచలన ఆరోపణలు

-

దేశ రాజధాని ఢిల్లీలోని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌  అధికార నివాసానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అధికారులు చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న సోరెన్‌కు ఈ నెల 27న ఈడీ తొమ్మిదోసారి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉందని.. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని అందులో పేర్కొన్నది.

ఈ మేరకు అయితే ఇవాళ ఈడీ అధికారులు తన నివాసానికి వెళ్లినప్పటికీ జార్ఖండ్ సీఎం మాత్రం అందుబాటులో లేడు. కావాలనే తప్పించుకుంటున్నాడా..? ఏదైనా కారణమా అనేది మాత్రం అర్థం కావడం లేదు. గత రాత్రి ఢిల్లీలోనే ఉన్నాడని పలువురు చెబుతున్నారు. ఈడీ అధికారులు వస్తున్నారనే విషయం తెలుసుకొనే ఇలా చేస్తున్నాడా అనేది అంతు చిక్కడం లేదు. దీంతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లితే.. కనిపించడం లేదు.. జార్ఖండ్ సీఎంను వెతికి పెట్టండి అని పేర్కొనడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news