ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి ఏర్పాటు చేసినార్రా కదలిరా సభ ఇవాళ రాజమండ్రిలో జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఒక మానసిక రోగి అని రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని మండిపడ్డారు. విశాఖపట్నంలో సిద్ధం అనే సభ ఏర్పాటు చేసుకున్నారని సభ పెట్టుకున్నా విమర్శించుకున్న బాధపడలేదు అన్నారు. కానీ నా ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోని బాక్సింగ్ బ్యాగులలో పెట్టి కొడుతున్నారని బూటు కాలుతో తంటున్నారు.. దీనిని నాగరిక సమాజం అంగీకరిస్తుందా అని అడిగారు. పోలీసులు కూడా చేతకాని వ్యక్తులు గా చూస్తున్నారని మేము అదే పని చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ సైకో తో మేము వేగలేమని నలుగురు ఎంపీలు పారిపోయారు మరోపక్క మాకొద్దు ఈ సైకో అని ఆరుగురు ఎమ్మెల్యేలు పారిపోయారని మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారని రేపు మాకు గేట్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీ ఖాళీ అయిపోతుందని పేర్కొన్నారు చంద్రబాబు. బదిలీల రాజకీయాన్ని నేనెప్పుడూ చూడలేదని కొంతమందిని ఇంటికి పంపించాడని, మరికొంతమందిని మార్చారని ఈ మార్చిన వారిలో సగం మంది ఎనిమిది మంది దళితులు ఆరుగురు బీసీలే ఉన్నారని ఇందులో 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారని పేర్కొన్నారు. టిడిపి జనసేన కలువగానే వైసిపి వాళ్లకు ప్యాంటు చచ్చిపోయిందని అంతా డైపర్లు వేసి వేసుకొని తిరుగుతున్నారని పేర్కొన్నారు. టిడిపి జనసేన గెలుపును ఎవ్వరూ ఆపలేరు అన్నారు.