ముగిస‌న పార్ల‌మెంట్ స‌మావేశాలు.. ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా

-

గ‌త కొద్ది రోజుల నుంచి న‌డుస్తున్న పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు నేడు ముగిశాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ఒక రోజు ముందుగానే.. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిశాయి. ఈ రోజు పార్లమెంట్ ఉభ‌య స‌భ‌లు ప్రారంభం అయిన వెంట‌నే నిర‌వాధిక వాయిదా వ‌స్తున్న‌ట్టు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, రాజ్య స‌భ చైర్మెన్ వెంక‌య్య నాయుడు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది బ‌డ్జెట్ స‌మావేశాలు రెండు విడ‌త‌లుగా నిర్వ‌హించారు.

పార్లమెంట్
పార్లమెంట్

మొద‌టి విడ‌త‌ జ‌న‌వ‌రి 31వ తేదీ నుంచి ప్రారంభం అయి.. ఫిబ్ర‌వ‌రి 11 వ‌ర‌కు జ‌రిగాయి. ఈ మొద‌టి విడ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామ‌న్.. బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్టింది. దీని త‌ర్వాత ఉభ‌య స‌భ‌లు కొద్ది రోజులు విరామం తీసుకున్నాయి. తిరిగి మార్చి 14వ తేదీ నుంచి రెండో విడ‌త పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలను నిర్వ‌హించారు.

ఈ రెండో విడ‌త బ‌డ్జెట్ స‌మావేశాలు ఏప్రిల్ 8 వ‌ర‌కు కొన‌సాగాల్సి ఉంది. కానీ నేటితో ముగిశాయ‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, రాజ్య స‌భ చైర్మెన్ వెంక‌య్య నాయుడు ప్ర‌క‌టించారు. ఈ రెండో విడత బ‌డ్జెట్ స‌మావేశాల్లో బ‌డ్జెట్, క్రిమిన‌ల్ ప్రొసిజ‌ర్ బిల్లుతో పాటు మ‌రి కొన్ని కీల‌క బిల్లులు ఆమోదం పొందాయి.

Read more RELATED
Recommended to you

Latest news