ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు శుభ‌వార్త‌.. కోవిడ్ 19 అడ్వాన్స్‌ను మ‌ళ్లీ తీసుకోవ‌చ్చు..

-

క‌రోనా వ‌ల్ల తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్న ఉద్యోగులు, కార్మికుల‌కు గ‌తేడాది ఈపీఎఫ్‌వో కోవిడ్ అడ్వాన్స్‌ను తీసుకునే వెసులుబాటు క‌ల్పించిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్పుడు కూడా చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న కార‌ణంగా ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు ఆ సంస్థ మ‌ళ్లీ ఆ అవ‌కాశాన్ని అందిస్తోంది. దీంతో వారు మ‌ళ్లీ కోవిడ్ 19 కార‌ణంతో ఈపీఎఫ్‌వో డ‌బ్బుల‌ను విత్‌డ్రా చేయ‌వ‌చ్చు.

epfo customers can take second time covid advance

కోవిడ్ 19ను కార‌ణం చూపి ఉద్యోగులు, కార్మికులు ఈపీఎఫ్‌లో త‌మ డ‌బ్బును అడ్వాన్స్ రూపంలో పొంద‌వ‌చ్చు. అందుకు గాను ఈ ప్ర‌క్రియ‌కు కేవ‌లం 3 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది. మొత్తం ప్ర‌క్రియ‌ను ఆటోమేటిగ్గా నిర్వ‌హిస్తారు. కేవైసీ పూర్తి అయి ఉన్న‌వారు విత్ డ్రా రిక్వెస్ట్ పెట్టుకుంటే 3 రోజుల్లోనే డ‌బ్బు బ్యాంకులో జ‌మ అవుతుంది.

కాగా 3 నెల‌ల బేసిక్ పే + డీఏ లేదా మొత్తం పీఎఫ్ సొమ్ములో 75 శాతం సొమ్మును విత్‌డ్రా చేయ‌వ‌చ్చు. ఏది త‌క్కువైతే అది అంద‌జేస్తారు. ఇక గ‌తేడాది కోవిడ్ 19 అడ్వాన్స్‌గా తీసుకున్న‌వారు కూడా ఈ సారి డ‌బ్బును అదే కార‌ణంతో విత్‌డ్రా చేయ‌వ‌చ్చు. ఈ మేర‌కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న కింద ఈ అవ‌కాశాన్ని అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈపీఎఫ్‌వో మొత్తం 76.31 ల‌క్ష‌ల కోవిడ్ 19 అడ్వాన్స్ క్లెయిమ్‌ల‌ను సెటిల్ చేయ‌గా మొత్తం రూ.18,698.15 కోట్ల‌ను చందాదారుల ఖాతాల్లో జ‌మ చేసింది. కోవిడ్ నేప‌థ్యంలో ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఈపీఎఫ్‌వో తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎంతో ఉపయోగ‌ప‌డ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news