ఆకలి చేసిన హత్యలు.. కుటుంబాన్ని కబళించిన కరోనా…!

-

మన దేశంలో కరోనా కంటే ఆకలి చావులు ఎక్కువ అనే విషయం మన అందరికి స్పష్టంగా తెలిసినా సరే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం… కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎందరో ఆకలి కేకలతో రోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది నేడు కన్నా తల్లి తండ్రులను, కట్టుకున్న భార్యలను, కన్న పిల్లలను పోషించలేక ఏ స్థాయిలో నరకం చూస్తున్నారో… స్పష్టంగా చెప్పే సంఘటన ఒకటి జరిగింది.

లాక్ డౌన్ లో మనకు చాలా సరదాగా ఉంటుంది కదా… మన పిల్లలు మన కుటుంబం మన ఆలోచనలు మంచి నిద్ర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సరదాలు మనకు. ఇంట్లో గడపడానికి ఇది మంచి సమయం మనకు. తినడానికి తిండి ఉంది, చూడటానికి టీవీ ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, పొద్దున్నే డాబా మీద వాకింగ్, వీకెండ్ వస్తే బిర్యాని, పులావ్, స్పెషల్ వంటలు ఇలా ఎన్నో ఉంటాయి మనకు.

బహుశా కరోనా లాక్ డౌన్ లో మనకు ఎవరికి ఆకలి అనేది తెలియలేదు. టైం కి అమ్మో, భార్యో ఎవరో ఒకరు వండి పెడుతూ ఉంటారు కాబట్టి ఏ గోలా ఉండదు మనకు. కాని కూటికి గుడ్డకు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. వలస కూలీలు, రోజు వారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా ఎక్కడ చూసినా సరే అందరూ ఖాళీ గానే ఉంటున్నారు. రోజు రోజుకి వారి ఆకలి కేకలతో దేశం మారుమోగిపోతుంది.

వారి బాధలు వినే వాడు లేడు, వారికి ఒక ముద్ద అన్నం పెట్టే చేయి లేదు. ఎంత మంది ముందుకి వచ్చి సహాయం చేస్తున్నా కేసీఆర్ అన్నట్టు మన దేశ జనాభాకు అన్నం పెట్టే దమ్ము ఏ దేశానికి లేదు అన్నట్టు, మన దేశంలో అందరి కడుపులు నింపే సామర్ధ్యం ఎవరికి లేదు. దీనితో తినడానికి తిండి లేక కప్పలు ఎలుకలు, పాములు పట్టుకుని తిని బ్రతికే వాళ్ళు ఎందరో ఉన్నారు మన భారతదేశంలో. ఇది మన దేశానికి పట్టిన గతి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఒక నిర్మాణంలో ఉన్న భవనం గోడలో ఒక కర్ర పెట్టి ఆ కర్రకు చిన్నారి ఉరి వేసుకున్న ఫోటో. ఎక్కడి ఫోటో అనేది స్పష్టంగా తెలియదు గాని, ఆ కుటుంబం మొత్తం ఉరి వేసుకోగా ఆ పిల్లాడికి ఎత్తుకి సరిపడా ఉరి తాడు, అందులో కర్ర ఏర్పాటు చేసి ఉరి తీసి కుటుంబం కూడా చచ్చిపోయింది. దేశాన్ని కన్నీరు పెట్టిస్తుంది ఈ ఫోటో..

నా భారతదేశం ఎంతో గొప్పది అనుకున్న మనం ఆ పిల్లాడు అలా వేలాడుతుంటే చూసి కన్నీరు పెడుతున్నాం. ఇలా వేలాది ప్రాణాలు పోతున్నాయి రోజు, పెళ్ళాం మెడలో పుస్తెలు, కాలి మెట్టెలు, ఇంట్లో సామాను అమ్ముకుని కుటుంబాలను పోషించే తండ్రులు ఎందరో ఉన్నారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఈ కనపడని ఆకలి చావులు ఎన్నో… వేలాడుతున్న శవాలు ఎన్నో…

Read more RELATED
Recommended to you

Latest news