కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీ పయనమైన రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ఉదయం పంజాబ్, హర్యానా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీకి బయల్దేరిన రైతుల గురించి కీలక విషయాలు తెలిశాయి. ఇటీవల వెలుగులోకి సమాచారం ప్రకారం ఒక్క పంజాబ్ నుంచే వందల సంఖ్యలో ట్రాక్టర్లు, వాహనాలు బయల్దేరతాయని, వాటిలో అన్నదాతలు ఆరు నెలలకు సరిపడా ఆహారం డీజిల్, ఇతర సామగ్రిని తీసుకువస్తారని తెలిసింది. కొందరు రైతులు మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరేవరకు నిరసన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. సుత్తి, రాళ్లను పగలకొట్టే పరికరాలతో సహా కావాల్సినవన్నీ తమ ట్రాలీల్లో ఉన్నాయని వెల్లడించారు. ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్‌తో మేం తమ ప్రాంతాల నుంచి బయలుదేరామని చెప్పారు. తమ యాత్రను భగ్నం చేసేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు.