మేడిగడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ బృందం

-

మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిన ఫిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి బృందం తాజాగా పరిశీలించింది. ముఖ్యంగా 21వ ఫిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డను పరిశీలించేందుకు రాకపోవడం గమనార్హం. 

మరోవైపు నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదని స్పష్టమవుతోంది. కేసీఆర్ నల్గొండ సభలో పాల్గొననున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినప్పటికీ బహిరంగసభల్లో పాల్గొంటున్నారనే కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మరికొద్ది సేపట్లోనే మేడిగడ్డ ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news